అమెరికా చెప్పినదానిపై దర్యాప్తు ప్రారంభించాం

అమెరికా చెప్పినదానిపై దర్యాప్తు ప్రారంభించాం

ఇస్లామాబాద్: అల్​కాయిదా చీఫ్ అల్ జవహరిని యూఎస్ హతమార్చిన విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని అఫ్గానిస్తాన్​ తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ రాజధాని కాబూల్​ సేఫ్​హౌస్ బాల్కనీలో జవహరిని డ్రోన్​ ద్వారా మట్టుబెట్టినట్లు అమెరికా ప్రకటించింది. అయితే, అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని ఖతార్​లోని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ గురువారం మీడియాతో చెప్పారు.

అమెరికా చెప్పినదాంట్లో నిజమెంతో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాగా, ఆమెరికా డ్రోన్ దాడిపై తాలిబాన్ నేతలు గానీ, ఇతర అధికారులుగానీ ఇప్పటివరకు అల్ జవహరి మరణాన్ని దృవీకరించలేదు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న అఫ్గాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం యూఎస్​తో సహా ఇతర దేశాలను సాయం కోరుతోంది. అమెరికా బలగాలు అఫ్గాన్​ను వీడినప్పటి నుంచి యూఎస్​ నుంచి ఆ దేశానికి వచ్చే బిలియన్ డాలర్ల నిధులు స్తంభించిపోయాయి.