న్యాయవాద దంపతుల హత్య కేసును సీరియస్‌గా తీసుకున్నాం

న్యాయవాద దంపతుల హత్య కేసును సీరియస్‌గా తీసుకున్నాం
  • రామగుండం పోలీసు కమీషనర్ వి.సత్యనారాయణ 

రామగుండం: న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, పీవీ నాగమణి ల దారుణహత్యను పోలీసుశాఖ సీరియస్‌గా తీసుకుందని రామగుండం పోలీసు కమీషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. దర్యాప్తు మొత్తం నిష్పక్షపాతంగా.. శరవేగంగా దర్యాప్తుగా జరుగుతోందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్ నుండి స్పెషల్ ఫోరెన్సిక్ మరియు సాంకేతిక బృందాలతో దర్యాప్తు జరుగుతోందని.. ఉన్నతాధికారుల సమక్షంలో దర్యాప్తు జరుగుతోందని ఆయన వివరించారు. అన్ని కోణాల్లో సాక్ష్యాధారాలను సేకరించడం జరుగుతోందన్నారు. హత్యలతో ప్రత్యక్షంగా పాల్గొన్న కుంట శ్రీను, చిరంజీవి మరియు రెక్కీ నిర్వహించిన కుమార్‌లను రిమాండుకు పంపడం జరిగిందన్నారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కారు, కత్తులను సమకూర్చిన బిట్టు శ్రీనును దర్యాప్తు బృందం అన్ని కోణాల్లో ప్రశ్నిస్తోందన్నారు. దర్యాప్తులో నిజానిజాల ఆధారంగా ఎంతటివారినైనా వదిలేదన్నారు. ఒత్తిళ్లకు, అపోహలకు తావులేదని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రేమించడంలేదని స్కూల్ టీచర్ పై కాల్పులు

లాక్‌డౌన్‌తో కంటి రోగులు ఐదింతలు పెరిగారు

టీఆర్ఎస్‌ని ఎలా ఎదుర్కొవాలి? 11 ప్రశ్నల ఫీడ్‌బ్యాక్ ఫామ్ ఇచ్చిన షర్మిల

షర్మిల నోట జై తెలంగాణ మాట