
- ఆరోగ్యం సహకరించక ..లీగల్గా బతికేందుకు వచ్చాం
- మాజీ మావోయిస్టు నేతలు సంజీవ, దీనా దంపతులు
జవహర్నగర్, వెలుగు: తాము పోలీసుల ఎదుట లొంగిపోలేదని, ఆరోగ్యం సహకరించక లీగల్జీవించేందుకు బయటకు వచ్చినట్లు మాజీ మావోయిస్టు నేత, కేంద్ర కమిటీ సభ్యుడు సంజీవ, ఆయన భార్య దీనా తెలిపారు. ఆదివారం జవహర్ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన జననాట్యమండలి ఆత్మీయ సమావేశంలో సంజీవ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు కూడా ఇదే విషయాన్ని చెప్పామన్నారు. ఐదు దశాబ్దాలు అజ్ఞాతంలో పని చేసి తాను, మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో ఉన్న తన భార్య ఎలా లొంగిపోతామన్నారు. లొంగిపోయారని అనడం సరికాదన్నారు.