
అన్ని రంగాల్లో తెలంగాణ మార్క్ కనిపించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ వార్డులు గెలుచుకుంటుంది తెలిపారు. మేనిఫేస్టోలో పెట్టిన వాటిలో 90 శాతం ఆమలు చేశామన్న మంత్రి.. ప్రజావసరాల కోసం పెట్టని వాటిని కూడా అమలు చేశామని చెప్పుకొచ్చారు. మీట్ ది ప్రెస్ లో హరీష్ రావు మాట్లాడారు. రైతులకు 24 గంటల పాటు కరెంట్, ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతుబంధు కింద రైతులకురూ. 73 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు హరీష్ రావు. కేసీఆర్ విజన్ తోనే తెలంగాణలో విద్యుత్ సమస్యను అధిగమించామని చెప్పారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో నేటికి విద్యుత్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. .
ALSO READ :- ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్కు బెదిరింపు.. ముంబై పోలీసుల అలెర్ట్