ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్కు బెదిరింపు.. ముంబై పోలీసుల అలెర్ట్

ఇండియా, న్యూజిలాండ్ సెమీస్  మ్యాచ్కు బెదిరింపు..   ముంబై పోలీసుల అలెర్ట్

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా, న్యూజిలాండ్  జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందకు ముంబైలోని వాంఖడే  స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు చాలా మంది సెలబ్రేటీలు కూడా వస్తున్నారు.  ఈ క్రమంలో  ఈ మ్యాచ్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు.  గుర్తుతెలియని వ్యక్తి ట్విట్టర్ లో  బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. 

ఈ పోస్ట్‌లో  ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేసిన ఆ ఆగంతకుడు.. తుపాకీ, హ్యాండ్‌ గ్రనేడ్‌, బుల్లెట్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో స్టేడియం, ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ వరల్డ్ కప్ లో  బెదిరింపులు రావడం ఇదేం తొలిసారి కాదు..  అక్టోబరు 14న జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.