చేనేత కార్మికులను ఆదుకోవాలి: వనం శాంతి కుమార్

చేనేత కార్మికులను ఆదుకోవాలి: వనం శాంతి కుమార్

నాంపల్లి, వెలుగు: చేనేత కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు వనం శాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి గంజ మురళీధర్​ అన్నారు. గురువారం నాంపల్లి చేనేత భవన్,​ చేనేత కమిషనర్​ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రుణ మాఫీ చేయాలని డిమాండ్​ చేశారు. ఈ ధర్నాలో పవర్​లూమ్​ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేశ్, ప్రతినిధులు నర్సయ్య, శ్రీనివాస్, దేవదాసు, పాండు, శంకరయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.