
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది రాహుల్ గాంధీ కల అని చెప్పిన మంత్రి.. రిజర్వేషన్లు సాధించేందుకు ఎంతటి పోరాటమైనా చేస్తామని అన్నారు. బీసీ కోటాను కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకిస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కామెంట్స్:
ALSO READ : బీసీ బిల్లు ఆమోదించకపోతే మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్ రెడ్డి
- వందేళ్ల తర్వాత కులగణన తెలంగాణలో చేశాం
- బీసీ జనాభా 56.5 శాతం అని తేలింది
- దానికి అనుకూలంగా కేబినెట్ ఆమోదించింది అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ కు పంపాం
- గవర్నర్ రాష్ట్రపతి కి పంపడం జరిగింది
- కానీ బీసీ బిల్లును ఆమోదించడం లేదు
- ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, లోకల్ బాడీ లో రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పంపితే ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారు
- ఓబీసీ 42 శాతం రిజర్వేషన్ల కోసం ధర్నా ఏర్పాటు చేశాం
- సాధించే వరకు విశ్రమించేది లేదు
- బీసీల హక్కుల కోసమే ఈ పోరాటం
- బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలి