ప్రతి నియోజకవర్గంలో అధునిక మార్కెట్లను నిర్మిస్తాం : కేసీఆర్ 

 ప్రతి నియోజకవర్గంలో అధునిక మార్కెట్లను నిర్మిస్తాం : కేసీఆర్ 

హైదరాబాద్ నగరంలోని మార్కెట్లపై అసెంబ్లీలో  సీఎం కేసీఆర్ మాట్లాడారు. చాలా మార్కెట్లు పరిశుభ్రంగా లేవన్న సీఎం.. ప్రతి నియోజకవర్గంలో అధునిక వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో శాస్త్రీయ ధృక్పథం లేకుండా మార్కెట్లను నిర్మించారని అన్నారు. మోండా మార్కెట్ ను చాలా సైంటిఫిక్ గా కట్టారని  చెప్పిన సీఎం.. అలాంటి మార్కెట్లు నిర్మించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు దానిని నమునాగా చూపించామని తెలిపారు. నారాయణపేట వెజిటెబుల్ మార్కెట్ చాలా అద్భుతంగా కట్టారని ప్రశంసించారు. కల్తీ విత్తనాల బెడద లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా కల్తీ విత్తనాలు ఉన్నాయని, కల్తీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.