చేవెళ్ల, వెలుగు: బీజాపూర్ హైవే పనులకు ఏడాదిన్నర గడువు ఉన్నా.. 9 నెలల్లో పూర్తి చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చెప్పారు. రోడ్డు కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డితో మాట్లాడి నాలుగు బ్యాచ్‌లుగా పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. గురువారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి ఎనుముల తిరుపతి రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు ఈ రోడ్డును పట్టించుకోకపోవడం పనులు లేటయ్యాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో ఇప్పుడు పనులు స్పీడప్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గోపె ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, పడాల రాములు పాల్గొన్నారు.
