జనసేన సర్కార్ ఖాయం.. మా ప్రత్యర్థి వైసీపీనే..

జనసేన సర్కార్ ఖాయం.. మా ప్రత్యర్థి వైసీపీనే..

ఏపీలో జనసేన ప్రభుత్వం కచ్చితంగా స్ధాపిస్తామని అధినేత పవన్ కళ్యాణ్  ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి జనసేన అంటే భయం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తు ఉంటుందని మరోసారి స్పష్టం చేస్తూ.. జనసేనకు ప్రత్యర్థి వైసీపీ పార్టీ అన్నారు. అజాత శ్రతువు అయ్యేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఏపీ బాగుపడాలంటే ఏం చేయాలో అది చేస్తానన్నారు జనసేనాని. టీడీపీ నేతలను సీఎం చేయడానికి పార్టీ స్థాపించలేదన్నారు పవన్.  ఏమీ తెలియకుండానే రాజకీయాల్లోకి వస్తామా అని ప్రశ్నించారు.

బలికావడానికి సిద్ధంగా లేను

 త్రిముఖ పోటీలో బలికావడానికి సిద్దంగా లేమన్నారు.  చంద్రబాబు మోసం చేస్తే మేమన్నా చిన్న పిల్లలమా.. మాకు గడ్డాలు... తెల్ల వెంట్రుకలు రాలేదా అన్నారు.  జూన్ నుంచి ప్రచారం మొదలు పెడతానని డిసెంబర్ లో ఎన్నికలుంటాయన్నారు. 2019లో 134 స్థానాల్లో పోటీ చేస్తే ...  తనను ఒక కులానికి పరిమితం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.   ఏపీ ప్రజల్లో పరివర్తన రావాలన్నారు.  కాపులను వైసీపీ నాయకులు తిట్టినా వారికే ఓట్లేశారన్నారు.  రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి..  భేషజాలు ఉండవన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చానన్నారు.  
 

చాలా మందికి నచ్చకపోయినా సీఎం  పదవినే టార్గెట్ గా పెట్టుకుని రాజకీయం చేస్తే కుదరదని, నినాదాలతో సీఎం కాలేరని, ఓట్లు వేస్తేనే సీఎం అవుతారని పవన్ తెలిపారు. రోడ్లపై గజమాలలు వేస్తే, హారతులు వేస్తే కారని, ఓట్లు వేస్తేనా అవుతారన్నారు. ప్రజాభిమానం ఓట్లుగా మారకపోతే ఎంతున్నా ప్రయోజనం లేదు. తనను చూసి కొందరు భయపడితే మంచిదేనన్నారు. రాజకీయాల్లో ఓ అభిప్రాయం చెప్పినప్పుడు వచ్చే వ్యతిరేకత తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నట్లు పవన్ తెలిపారు. ఏపీ కోసం కొందరికి శత్రువు కావడానికి సిద్ధమేనన్నారు.

పొత్తుల వ్యూహం

పొత్తులు రాజకీయాల్లో ఒక వ్యూహమన్నారు పవన్. సీఎం ఎవరనేది ఎన్నికల తరువాత మాట్లాతామన్నారు.  అన్నీ పద్దతులు బాగుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయన్నారు . సీట్లు లేకుండా సీఎం పదవి అడిగితే ఇస్తారా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో  భీమవరంలో తాను పోటీ చేసినప్పుడు 16 వేల దొంగ ఓట్లు పోలయ్యాయన్న పవన్ .. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.