సుభాష్ నగర్ హనుమాన్ ఆలయానికి దారి క్లియర్

సుభాష్ నగర్ హనుమాన్ ఆలయానికి దారి క్లియర్

సుభాష్ నగర్‌‌లోని హనుమాన్ టెంపుల్ గుడి దారి విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడం జరిగిందని, కంటోన్మెంట్ సీఈఓతో మాట్లాడినట్లు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నలు వెల్లడించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు వారు కంటోన్మెంట్ సీఈఓతో మాట్లాడారు. గుడికి దారి ఇస్తామని సీఈఓ హామీ ఇచ్చారు. హనుమాన్ టెంపుల్ స్థలం కబ్జా చేస్తున్నారంటూ ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరహార దీక్షకు ఎమ్మెల్యేలు మైనంపల్లి, సాయన్నలు మద్దతు తెలిపారు. నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింప చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ.. గుడి స్థలాన్ని సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి తన వెంచర్ లో కలిపేసుకున్నాడని, దీంతో గుడికి వెళ్ళడానికి దారి లేకుండా పోయిందన్నారు. సుదర్శన్ రెడ్డి వేసిన వెంచర్ లో గుడి స్థలాన్ని పార్క్ లాగా చూపించినట్లు, ఈ విషయాన్ని కంటోన్మెంట్ సీఈఓకు తెలియచేసి మాట్లాడి గుడి దారి విషయాన్ని క్లియర్ చేయడం జరిగిందన్నారు. గుడిలో ఉన్న గోశాలను కూల్చేశారన్నారు. గుడి పేరు మీద 21 గుంటల ల్యాండ్ రికార్డ్ లో ఉన్నట్లు తెలిపారు. హనుమాన్ టెంపుల్ పరిరక్షణ కమిటీకి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీనిచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడటానికే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు. గుడి తన నియోజకవర్గంలో ఉన్నా.. మల్కాజ్ గిరి నుండి భక్తులు ఎక్కువగా వస్తారని కంటోన్మెంట్ ఎమ్మె్ల్యే సాయన్న తెలిపారు. మైనంపల్లితో కలిసి కంటోన్మెంట్ సీఈఓ తో మాట్లాడం జరిగిందన్నారు. గుడికి దారి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు.