అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తాం

అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తాం

పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా రేపు(శుక్రవారం) 'చలో రాజ్‌భవన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ధరలపై పార్లమెంట్‌ను కూడా స్తంభింపజేస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నిర్భంధించాలని చూస్తే పోలీస్‌స్టేషన్లను ముట్టడిస్తామని తేల్చి చెప్పారు. ఎన్ని జైళ్లలో, ఎన్ని స్టేషన్‌లలో పెడతారో చూస్తామన్నారు. పెట్రోల్, డీజిల్‌, గ్యాస్‌పై ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ కలిసి 35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని తెలిపారు.

మరోవైపు రేపు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో రాజ్ భవన్ కు  పోలీసులు అనుమతి ఇవ్వలేదు.శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమన్నారు. కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న దరఖాస్తును రిజక్ట్ చేస్తూ..లిఖిత పూర్వక సమాచారమిచ్చారు పోలీసులు. ఇందిరా పార్క్ దగ్గర కేవలం.. రెండు మైకులు పెట్టుకొని సభ నిర్వహించుకోడానికే అనుమతినిచ్చారు.