ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ వెయిటేజీ ఎత్తేస్తం

ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ వెయిటేజీ ఎత్తేస్తం

దీనిపై సర్కారుకు ప్రతిపాదన పంపుతం: పాపిరెడ్డి

హైదరాబాద్, వెలుగు:  ఎంసెట్​ ర్యాంకుల్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేతపై సర్కారుకు ప్రతిపాదన చేస్తామని హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ చైర్మన్​ పాపిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్​ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఇది గ్రామీణ ప్రాంత, సర్కారు కాలేజీల స్టూడెంట్లకు ఇబ్బందిగా మారిందన్న విమర్శలు తొలి నుంచీ ఉన్నాయి. దీనిపై పాపిరెడ్డిని ప్రశ్నించగా.. వెయిటేజీ ఎత్తివేత ఆలోచన ఉందని చెప్పారు. దీనిపై ఎక్స్ పర్టులతో కమిటీ వేసి.. సర్కారుకు ప్రాతిపాదన చేస్తామని తెలిపారు.