బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటాం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటాం

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తూ , మాదిగలకు అన్యాయం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.   బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆదివారం   మాదన్నపేట్ లో జరిగిన  ఎంఆర్పీఎస్  కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 2న  జాతీయ రహదారులపై, మాదిగ బస్తీలలో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. జూలై 3న పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యాలయం నుంచి వినతి పత్రం తీసుకొని  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగే చోటుకు భారీ ప్రదర్శనగా వెళ్తామని వెల్లడించారు. తమను ఎక్కడైనా పోలీసులు అడ్డుకుంటే..  హైదరాబాద్ ను  దిగ్బంధం  చేస్తామని హెచ్చరించారు.