కేటీఆర్కు బాధ్యతలు ఇస్తే స్వాగతిస్తాం.. పార్టీ మార్పుపై హరీశ్ రావు కామెంట్స్

కేటీఆర్కు బాధ్యతలు ఇస్తే స్వాగతిస్తాం.. పార్టీ మార్పుపై హరీశ్ రావు కామెంట్స్

పార్టీ మార్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు. పార్టీ మారుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని  అన్నారు హరీశ్ రావు. పార్టీ మారే పరిస్థితి లేదని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారంపై గతంలోనే  డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ఏర్పడక ముందు నుంచే కేసీఆర్ తో ఉన్నానని.. కేసీఆర్ ఏం చెబితే అది పాటిస్తానని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ మాటే.. హరీశ్ బాట అని ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానని, ఏ బాధ్యత లేకుంటే ఒక కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. అంతేకాకుండా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తామని ప్రెస్ మీట్ లో చెప్పారు. 

బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు జరుగుతున్నాయనే విమర్శలు ఈ మధ్య వస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం కేటీఆర్, కవిత, హరీశ్ రావు ల మధ్య ఆధిపత్య పోటీ నడుస్తోందని, అందుకే కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుందనే ఊహాగానాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. కేటీఆర్, కవిత మధ్య ఆధిపత్య పోరులో హరీశ్ కు ప్రాధాన్యం తగ్గిందని, అందుకే పార్టీ మారే అవకాశం ఉందని ఇతర పార్టీల నాయకులు విమర్శించారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. 

అయితే పార్టీ మార్పు అనేది సోషల్ మీడియా ప్రచారమేనని, అందులో వాస్తవం  లేదని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ తోనే ఉంటానని, బీఆర్ఎస్ కార్యకర్గానే పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు.