కిరణ్‌‌‌‌తో కంఫర్ట్‌‌‌‌గా వర్క్ చేశాం.. హీరో, ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఎక్కడ కలగలే: రాజేష్ దండా

కిరణ్‌‌‌‌తో కంఫర్ట్‌‌‌‌గా వర్క్ చేశాం.. హీరో, ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఎక్కడ కలగలే: రాజేష్ దండా

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ అభిమానులు కలిసి రూపొందించిన చిత్రమే ‘కె ర్యాంప్’ అని నిర్మాతలు రాజేష్ దండా, శివ బొమ్మకు చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో  హీరో పాత్ర పేరు కుమార్. అందుకే  ‘కుమార్ ర్యాంప్’ అనే టైటిల్‌ అనుకున్నాం. కాస్త  లెంగ్తీగా ఉందని ‘కె -ర్యాంప్’గా మార్చాం. ఇది కొందరికి బూతులా అనిపించవచ్చు. అది వారి దృష్టి కోణం మాత్రమే.

 మా సంస్థలో అతి తక్కువ టైమ్‌లో పూర్తయిన చిత్రమిదే.  సినిమా ప్రారంభించిన ఆరో నెలలోనే రిలీజ్ చేస్తున్నాం. కేరళలో షూటింగ్ చేయడం  సినిమాకు కొత్త లుక్ వచ్చింది.  కథలో హీరోయిన్ కేరళ అమ్మాయి. అక్కడ కాలేజ్  సీన్స్, ఓనమ్ సాంగ్ విజువల్‌గా కలర్‌‌ఫుల్‌గా వచ్చాయి. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చినా సినిమా చూస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కడా ఇబ్బంది పడరు.  

నలుగురు ఫ్రెండ్స్‌ చిల్ అయ్యేటప్పుడు ఎలా మాట్లాడుకుంటామో అలానే  డైలాగ్స్ ఉంటాయి. కిరణ్ అబ్బవరంతో చాలా కంఫర్ట్‌గా వర్క్ చేశాం. ఆయన హీరో, మేము ప్రొడ్యూసర్ అనే భావన కలగలేదు. దీపావళికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నా  అన్ని సినిమాలూ ఆదరణ పొందాలని కోరుకుంటున్నా.  ప్రొడ్యూసర్స్ అంతా స్నేహితులమే. మా మధ్య విభేదాలు లేవు’ అని చెప్పారు.