రాగల 3 రోజులకు వాతావరణ సూచన

రాగల 3 రోజులకు వాతావరణ సూచన
  • స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

హైదరాబాద్: వచ్చే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దక్షిణ ఝార్ఖండ్ పరిసరాల్లో ఉత్తర ఒరిస్సాతోపాటు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్ & గాంగ్ టక్, పశ్చిమ బెంగాల్  ప్రాంతాల్లో అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోందని.. అలాగే ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనము సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశకు ఒంపు తిరిగి ఉందని వివరించింది. 
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణా రాష్ట్రంలో  తేలికపాటి  నుండి మోస్తరు వర్షములు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని, అలాగే ఎల్లుండి  తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాదు రాగల మూడు రోజులు  తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షములు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.