రాగల 3 రోజులకు వాతావరణ సూచన

రాగల 3 రోజులకు వాతావరణ సూచన
  • దేశమంతా వ్యాపించిన ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్:  రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షములుతో పాటు  అతి భారీ వర్షాలు.. ఎల్లుండి అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 
నిన్నటి  ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వద్ద ఉత్తర ద్వీపకల్పమే కాకుండా భారతదేశం అంతటా వ్యాపించి ఉందని వివరించింది. ఈ ఆవర్తనం  దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో  తేలికపాటి  నుండి మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.