రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత  

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత  

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. చలి తీవ్రత బాగా పెరిగింది. సాయంత్రం 5.30కే మొదలవుతున్న చలి ఉదయం 8.30 దాటినా ప్రభావం చూపుతూనే ఉంది. ఇవాళ ఉదయం 8.30 వరకు మబ్బులు కమ్మి ఉండడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న చలితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ సిటీవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చిన్న పిల్లలు, వృద్ధులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు.

ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం కూలీ పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు.  బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. పెరిగిన చలితో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.