రాగల 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

 రాగల 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 3 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.  గ్రేటర్ హైదరాబాద్, జంట నగరాలు, ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలోని కొన్ని  ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల కుండపోత కురిసే అవకాశం ఉంది.  ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.