పీజీ మెడికల్​ అడ్మిషన్లకు నేటి నుంచి వెబ్​ ఆప్షన్లు

పీజీ మెడికల్​ అడ్మిషన్లకు నేటి నుంచి వెబ్​ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్​ ఫస్ట్​ ఫేజ్​అడ్మిషన్ల కోసం ఆదివారం నుంచి వెబ్​ఆప్షన్స్ ప్రాసెస్ కొనసాగుతుందని కాళోజీ హెల్త్​యూనివర్సిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఫైనల్ మెరిట్​లిస్టులోని అభ్యర్థులు కాలేజీల వారీగా ఆప్షన్లు   ఇచ్చుకోవాలని సూచించింది. 

మెరిట్​లిస్ట్, సీట్ల వివరాలన్నీ వర్సిటీ వెబ్​సైట్​లో www.knruhs.telangana.gov.in అందుబాటులో ఉన్నాయని తెలిపింది.