
కొండపాక, వెలుగు: ఆగి ఉన్న లారీని పెండ్లి బస్సు ఢీకొట్టడడంతో 10 మందికి స్వల్ప గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్ సిటీ పద్మనగర్ కు చెందిన కాలనీవాసులు, ప్రైవేట్ బస్సు లో హైదరాబాద్ పరిధి శంషాబాద్ లో పెండ్లికి హాజరై తిరిగి వెళ్తున్నారు.
కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద శనివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సులోని 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.