కరోనా దెబ్బకు చిరిగిన వెడ్డింగ్ కార్డ్స్ బిజినెస్

కరోనా దెబ్బకు చిరిగిన వెడ్డింగ్ కార్డ్స్ బిజినెస్

పెళ్లి ఫిక్స్ అయిందంటే చాలు.. అందరినీ మెప్పించాలనే తీరులో పెళ్లి జరగాలని చాలామంది అనుకుంటారు. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు డిఫరెంట్‎గా చేస్తూ.. అందరిలో వెరైటీగా ఉండాలని థింక్ చేస్తారు. పెళ్లిలో ముఖ్య ఘట్టం.. అతిథులను ఆహ్వానించడం. ఈ ఆహ్వానానికి ఉపయోగించే పెళ్ళి పత్రికల మీద ఎంతో శ్రద్ధ పెట్టి.. డిఫరెంట్‎గా ట్రై చేస్తుంటారు. దాంతో వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని.. వెడ్డింగ్ కార్డ్ షాప్ ఓనర్లు డిఫరెంట్ డిఫరెంట్ వెడ్డింగ్ కార్డ్స్‎ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. 

పెళ్లినగానే షాపింగ్‎లు, క్యాటరింగ్ ఆర్డర్స్, బంధుమిత్రులకు ఆహ్వానాలు.. మొదలైన వాటితో పెళ్లి జరుగుతున్న ఫ్యామిలీలు చాలా బిజీబిజీగా మారతాయి. జీవితంలో ఒకేసారీ వచ్చే అపూర్వమైన వేడుక పెళ్లి. ఈ పెళ్లిని కలకాలం గుర్తుంచేవి పెళ్లి ఫోటోలు ఒకటైతే.. రెండోది పెళ్లి శుభలేఖలు. టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా.. శుభలేఖ ఇచ్చి పెళ్లికి పిలవడం సాంప్రదాయం. అంతేకాకుండా.. నేటి జనరేషన్ వెడ్డింగ్ కార్డ్ ఎంత కాస్లీగా ఉంటే.. అంత స్టేటస్ అనుకుంటున్నారు. శుభలేఖను బట్టే పెళ్లి ఏ రేంజ్‎లో జరుపుకుంటున్నామో తెలుస్తుందనుకుంటున్నారు. ఒకప్పుడు చాలామంది ట్రెడిషనల్‎గా ఉండే కార్డ్స్ సెలెక్ట్ చేసుకునే వారు. కానీ, ఇప్పుడు మాత్రం అందరినీ మెస్మరైజ్ చేసే మోడల్స్‎ను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

పెళ్లి కార్డ్స్ సెలక్ట్ చేసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి డిసీషన్ తీసుకుంటారు. పెళ్లిలో ఎంతో కీలక పాత్ర పోషించే ఈ వెడ్డింగ్ కార్డ్స్ బిజినెస్ కరోనా కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసింది. కరోనా మెల్లగా తగ్గుముఖం పట్టడంతో బిజినెస్ మళ్లీ యదావిధిగా సాగిపోతుందనుకునేలోపే వారికి మరో పెద్ద కష్టం వచ్చి పడిందంటున్నారు. వెడ్డింగ్ కార్డ్స్ మీద 12 శాతం ఉన్న జీఎస్టీ.. 18 శాతానికి పెరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. దానికి తోడు కోల్ షార్టేజ్ ఎఫేక్ట్ కూడా వెడ్డింగ్ బిజినెస్‎పై పడటంతో.. పెపర్ కాస్ట్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. గతంలో పెళ్లికి 1000 నుంచి 2000 కార్డ్స్ ప్రింట్ చేయించుకునేవారు. వీటికి తోడుగా ఫ్రెండ్స్, వీఐపీ కార్డ్స్ అంటూ వెరైటీ కార్డ్స్ సేలేక్ట్ చేసుకునే వారు.  కానీ, ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ ధర పెరగడంతో.. కేవలం 200 నుంచి 500లోపే కార్డ్స్ ప్రింట్ చేయించుకుంటున్నారని వ్యాపారులు అంటున్నారు.

సీజనల్ బిజినెస్ అయిన పెళ్లి పత్రికల వ్యాపారంపై టెక్నాలజీ ఎఫెక్ట్ పడిందని వ్యాపారులంటున్నారు. ప్రస్తుత కాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. దీనికితోడు కొత్తకొత్త ఆప్‎లు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో విషయం ఏదైనా సరే.. మొబైల్స్‎లో ఇన్విటేషన్ ప్రిపేర్ చేస్తున్నారు. చాలామంది తమ తమ ఫంక్షన్లకు ఫోన్ కార్డ్ ద్వారానే ఇన్వైట్ చేస్తున్నారు. అయితే పెళ్లికి మాత్రం ఇప్పటికీ వెడ్డింగ్ కార్డ్స్ ద్వారానే ఇన్వైట్ చేస్తున్నారు. అలాంటి సంప్రదాయాన్ని ఎవరు మరిచిపోవద్దని.. టెక్నాలజీని వాడుకుంటే ప్రింటింగ్ బిజినెస్ మీద ఆధారపడిన వారి జీవితాలు రోడ్డున పడతాయని వ్యాపారులు అంటున్నారు.

ప్రస్తుతం వెడ్డింగ్ కార్డ్స్‎లో ఎన్నో రకాల వెరైటీలు ప్రింటింగ్ షాపుల్లో కళకళలాడుతున్నాయి. ప్రస్తుత కాలంలో ట్రెడిషనల్ అండ్ న్యూ మోడల్ ట్రెండీ వెడ్డింగ్ కార్డ్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఒకప్పడు పెళ్లి కార్డు అంటే ఒకే రకం కార్డ్స్ ఉండేవి. కానీ ఇప్పడు.. బోలెడన్ని వెరైటీస్ వచ్చేశాయి. ప్రస్తుతం పర్సనల్ వెడ్డింగ్ కార్డ్స్.. చాక్లెట్ రూపంలో, ఏటిఎం కార్డ్ రూపంలో, ఆకు ఆకారంలో, పువ్వులు, పెన్ను, నెమలి పింఛం ఆకారంలో చాలా చిన్నచిన్న సైజుల్లో ఆకట్టుకుంటున్నాయి. ఇవేకాక గిఫ్ట్ బాక్స్ కార్డులు, డిజైనర్ కార్డులు, త్రీడి మోడల్ కార్డులు, లేజర్ కట్ మోడల్స్‎ను కస్టమర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొంతమంది అయితే ప్రత్యేకంగా కస్టమైజ్డ్ వెడ్డింగ్ కార్డ్స్ చేయించుకుంటున్నారు. సంగీత్, మెహందీ, పెళ్ళి, రిసెప్షన్ వంటి నాలుగు కార్యక్రమాలు కవర్ అయ్యేలా ఒకే కార్డును సెలక్టు చేసుకుంటున్నారని వెడ్డింగ్ కార్డ్ వ్యాపారులు అంటున్నారు. అటువంటి కార్డుల ధర 4 రూపాయల నుంచి మొదలై  4 వేలు.. ఆపై వరకు ఉంటుందన్నారు.

పెళ్లి కార్డ్స్ అంటే కేవలం పెళ్లి అయ్యేంతవరకు పెట్టుకొని ఆ తర్వాత పడేస్తుంటారు కొంతమంది. కానీ, కొంతమంది మాత్రం ఈ వెరైటీ కార్డ్స్‎ని ఇళ్లల్లో షో పీసెస్‎గా కూడా పెట్టుకుంటుటారు. మార్కెట్లో ఇటువంటి వెరైటీ కార్డ్‎లకు క్రేజ్ అండ్ డిమాండ్ బాగా ఉంటుందని వెడ్డింగ్ కార్డ్ డిజైనర్స్ అంటున్నారు.

For More News..

హుజూరాబాద్ లో డబ్బుల పంపిణీ లొల్లి

కేసీఆర్‎కు బండి సంజయ్ డెడ్‎లైన్

హుజురాబాద్ ఎన్నికలు రద్దు చేయాలి: కాంగ్రెస్

సూసైడ్ అటెంప్ట్ చేసిన మిస్ తెలంగాణ