హుజురాబాద్ ఎన్నికలు రద్దు చేయాలి

V6 Velugu Posted on Oct 28, 2021

హుజురాబాద్ ఎన్నికలు రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. హుజురాబాద్ లో ఓట్లను కొనుగోలుచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రెస్‎మీట్ పెట్టి మాట్లాడారు.

ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హుజురాబాద్‎లో అడ్డగోలుగా ఓటర్లను కొనుగోలు చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటుకు 6 వేల రూపాయల నుంచి 10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. బహుమతులు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోలు, అధికార దుర్వినియోగం తదితర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని.. ఇంత విచ్చలవిడిగా ఎన్నికల నిబంధనల అతిక్రమణ ఎక్కడా జరగలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

For More News..

సూసైడ్ అటెంప్ట్ చేసిన మిస్ తెలంగాణ

దళితబంధుపై హైకోర్టు కీలక తీర్పు

Tagged Bjp, TRS, Telangana, Congress, dasoju sravan, money distribution, Huzurabad, Huzurabad By election

Latest Videos

Subscribe Now

More News