వారఫలాలు ( 2026 జూన్14-20) : ఈ వారంలో సోమవారం రోజు అమావాస్య అయింది. చంద్రుడు.. సూర్యుడు స్థానాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మిగతా గ్రహాల సంచారం ఆధారంగా ఈ వారం ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది. ఎవరికి అనూలంగా ఉంటుంది.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. 12 రాశుల వారి వారఫలాలను తెలుసుకుందాం..!
మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పాత స్నేహితులు కలవడంతో ఎంజాయి చేస్తారు. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం మంచి సమయం. వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు . ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృషభరాశి: ఈ రాశి వారు ఈ వారం ఏ విషయాన్ని అనవసరంగా ఆలోచించకండి . అనవసరంగా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి..జాగ్రత్తగా మాట్లాడండి. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. కానీ ఏదోలా అన్నింటినీ మేనేజ్ చేసేస్తారు. ఉద్యోగస్తులు అనవసరంగా మాటపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతీ విషయానికి కోపానికి గురి కాకుండా ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోండి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులుసూచిస్తున్నారు.
మిథునరాశి: ఈ వారం ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక వ్యవహారాలు అత్యధిక భాగం సానుకూలపడతాయి. కుటుంబ వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి.కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. . నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం కుటుంబపరంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు కూడా లాభాలపరంగా ఊపందుకుంటాయి. సొంత ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సింహరాశి: ఈ రాశి వారు ఈ వారం కొద్దిగా శ్రమ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వృత్తి.. వ్యాపారం.. ఉద్యోగ విషయాల్లో మొదట్లో కాస్త నెమ్మదిగా ఉన్న వారం మధ్య నుంచి పుంజుకుంటాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు. మిమ్మలను నమ్మించి మోసం చేసే అవకాశాలున్నాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పనిభారం పెరుగుతుంది. ఎలాంటి ఆందోళన పడకండి.. వారం చివరిలో అంతా మంచే జరుగుతుంది.
కన్యారాశి: ఈరాశి వారికి ఈవారం చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉండటంతో సమాజంలో గౌరవంతో పాటు గుర్తిపు లభిస్తుంది. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ప్రశంశలు.. అవార్డులు లభిస్తాయి. వ్యాపారస్తులు అంచనాలకు మించి లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
తులారాశి: ఈ వారం ఈ రాశి వారు తీరిక లేకుండా గడిపే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. చంద్రుని శుభదృష్టి వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. . ఆర్థిక విషయాల్లో కొత్త నిర్ణయాలు అమలుచేసే అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు వస్తాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. జీవిత భాగస్వామి సలహాలు కలిసి వస్తాయి.
వృశ్చికరాశి: ఈ వారం ఈ రాశి వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో చాలా తక్కువుగా మాట్లాడండి. మీ నిర్ణయాన్ని ఎక్కడ బహిరంగ పరచవద్దని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు మీ ప్రమేమం లేకుండానే అవమానాలు ఎదుర్కొంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వారం చివరిలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు దూరంగా ఉండండి.
ధనుస్సురాశి: ఈ వారం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. మాట పట్టింపునకు పోకుండా మీ పని మీరు చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి : ఈరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు పెరగవచ్చు. కుటుంబంలో వివాదాలు కూడా ఉండవచ్చు. చాలా తెలివిగా వ్యవహరించండి. అనుకోకుండా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు సీనియర్లతో విబేధాలు ఏర్పడుతాయి. సహోద్యోగుల సహకారం అంతగా ఉండదు. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. బంధువులతో అనుకోకుండా గొడవలు ఏర్పడుతాయి. . ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.కార్యాలయంలో ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ... పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి.
మీన రాశి: ఈ రాశి వారు ఈ వారం గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. అనుకోకుండా కెరీర్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. మీ శత్రువులు మీపై విజయం సాధించే అవకాశాలున్నాయి. ప్రతి పని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ.. పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
