
శుక్రవారం అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన రోజు. ఎందుకంటే.. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేడి అదేరోజు కాబట్టి. అందుకే ఆరోజున థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ OTTకి కూడా వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను శుక్రవారం రోజునే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అలా వారం లాగే ఈ శుక్రవారం(ఏప్రిల్ 12) కూడా క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఓటీటీ సంస్థలు. మరి ఏ ఏ ఓటీటీ సంస్థ ఎలాంటి కొత్త కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ఎలా ఉందంటే?
అమెజాన్ ప్రైమ్ (ఏప్రిల్ 12):
- ఓం భీం బుష్(తెలుగు సినిమా)
- ఎన్‌డబ్ల్యూఎస్‌ఎల్ (అమెజాన్ ఒరిజినల్ సిరీస్)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (ఏప్రిల్ 12):
- ప్రేమలు
నెట్‌ఫ్లిక్స్(ఏప్రిల్ 12)
- లాల్ సలామ్(తమిళ డబ్బింగ్)
- అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)
- గుడ్ టైమ్స్ (యానిమేటెడ్ సిట్‌కామ్)
- లవ్ డివైడెడ్ (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)
- స్టోలెన్ (స్వీడిష్ చిత్రం)
- ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్)
జీ5(ఏప్రిల్ 12):
- గామి(తెలుగు సినిమా)