
వారఫలాలు
మేషం
ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి. అనుకోని సంఘటన ఆకట్టుకుంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. తరచూ దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు వచ్చే వీలుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వారారంభంలో దూరప్రయాణాలు.
వృషభం
ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. ముఖ్య కార్యాలు సవ్యంగా పూర్తి కాగల సమయం. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి. సన్నిహితులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి. చాకచక్యంగా శత్రువులను స్నేహితులుగా మార్చుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటి నిర్మాణాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారులు క్రమేపీ లాభాల బాట పడతారు. ఉద్యోగులకు హోదాలు అనుకోని విధంగా దక్కవచ్చు.
మిథునం
చేపట్టిన కార్యాలు నిదానంగా సాగుతాయి. ఆదాయ వనరులు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. కొన్ని సమస్యల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. సేవాకార్యక్రమాలలో మీరూ భాగ ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. ముఖ్య కార్యాలు సవ్యంగా పూర్తి కాగల సమయం. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి. సన్నిహితులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి. చాకచక్యంగా శత్రువులను స్నేహితులుగా మార్చుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటి నిర్మాణాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారులు క్రమేపీ లాభాల బాట పడతారు. ఉద్యోగులకు హోదాలు అనుకోని విధంగా దక్కవచ్చు. స్వాములవుతారు. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు దక్కవచ్చు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. కొత్త భాగస్వాములు మీతో కలుస్తారు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.
కర్కాటకం
రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సకాలంలో పూర్తి కాగలవు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సమాజంలో మరింత పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు విధులలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం
ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. వేడుకలకు హాజరవుతారు. పాతబాకీలు వసూలవుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబసభ్యులను సంప్రదిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొద్దిపాటి ఇంక్రిమెంట్లు దక్కుతాయి.
కన్య
ముఖ్య కార్యాలు నత్తనడకన సాగుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు తప్పకపోవచ్చు. స్నేహితులతో అకారణ వివాదాలు. తప్పని పరిస్థితిలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి శ్రమిస్తారు. బంధువుల కష్టసుఖాలు విచారిస్తారు. ఆప్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు. భూములు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.
తుల
ముఖ్య కార్యాలు అనుకున్న విధంగా పూర్తి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. రావలసిన బాకీలు అందుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు నైపుణ్యత చాటుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. ఐటీరంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికం
అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులు మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలకు కార్యరూపం. చేపట్టిన కార్యక్రమాల్లో పురోగతి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారులకు అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.
ధనస్సు
బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఉద్యోగయత్నాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారులు.. పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు విజయాల బాటలో నడుస్తారు.
మకరం
కార్యక్రమాలలో జాప్యం. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆలోచనలు అంతగా కలసిరావు. తండ్రి తరఫు వారితో వివాదాలు. దూరప్రయాణాలు ఉంటాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారులకు కొంత నిరాశ తప్పదు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు, పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు పరిశోధనలు అనుకూలిస్తాయి. వారాంతంలో స్వల్ప ధనలబ్ధి. ఆస్తిలాభం.
కుంభం
అత్యంత ఇష్టులైన వారిని కలుసుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. చిరకాల మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు, విందువినోదాలు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారుల యత్నాలు సఫలం. ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. విద్యార్థులకు పురస్కారాలు.
మీనం
ఆదాయం ఆశాజనకం. స్నేహితులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన ఉత్తరం సంతోషం కలిగిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే ఛాన్స్. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.