
వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జులై 20 నుంచి జులై26 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం...
మేషరాశి: ఈ రాశివారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలకపాత్రపోషించే అవకాశం ఉంది. వృత్తి పనివారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపిస్తాయి. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృషభ రాశి : ఈ రాశి వారు ఈ వారం కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కాల్ లెటర్స్ వస్తాయి.ఈ వారంలో మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
మిథునరాశి: ఈ వారం ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులు పనిభారం పెరుగుతుంది. అయినా సంతృప్తికరంగానే ఉంటుంది. వ్యాపారాలు కొత్త ఊపునందుకుంటాయి. నిరుద్యోగులు ఊహించని ఆఫర్ అందుకునే అవకాశం ఉంది. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.ప్రేమ.. పెళ్లి ప్రయత్నాలు కలసి వస్తాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈవారం అనుకూల వాతావరణం ఉంటుంది.. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
సింహ రాశి : ఈ రాశి వారు ఈ వారం చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి. కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. కార్యాలయంలో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చర్మ సంబంధ ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోండి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
కన్యారాశి: ఈ వారం ఆర్ధికంగా అభివృద్ది చెందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మంచి ఆఫర్లు అందుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంశలు లభిస్తాయి. ఉద్యోగాల్లో మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
తులా రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరు చేపట్టిన పనుల్లో మొదట్లో ఆటంకం కలిగినా... చివరికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది. వారాంతంలో అంతా మంచే జరుగుతుంది. గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి బయటపడతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సా హం లభిస్తాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. మొండి బకాయిలు, బాకీలు వసూలవుతాయి.
ధనుస్సురాశి: ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ వారం ఊహించని లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కార్యాలయంలో మీరే కీలకపాత్ర పోషించే అవకాశం రావడంతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆశించిన లాభాలు కలుగుతాయి.
మకర రాశి : ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ వారం చివరిలో నిరుద్యోగులు గుడ్న్యూస్వింటారు. పెళ్లి ప్రయత్నాలు కలసి వస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ప్రేమ.. పెళ్లి విషయాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ తో జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మీనరాశి: ఈ రాశి వారు ఈ వారం బిజీగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులు అనుకోకుండా నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాలు సవ్యంగా సాగి పోతాయి. అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు.