వారఫలాలు: ఈ వారం గ్రహణ ప్రభావం అధికం... సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!

వారఫలాలు:    ఈ వారం గ్రహణ ప్రభావం అధికం... సెప్టెంబర్ 7  నుంచి  13  వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!

వారఫలాలు:  ఈ వారం ప్రారంభంలో సెప్టెంబర్​ 7 వ తేది చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (  సెప్టెంబర్​ 7  నుంచి సెప్టెంబర్​ 13 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం.

 మేష రాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా తక్కువుగా మాట్లాండండి.  అగ్రిమెంట్లు.. కీలక ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా.  చంద్ర గ్రహణం ప్రభావంతో  ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారు. 

వృషభరాశి: ఈ రాశి వారికి చంద్రగ్రహణం ఎక్కువుగా ఉంటుంది.  అనవసర ఖర్చులు.. ఆఫీసుల్లో ఒత్తిడి.. వ్యాపారస్తులకు  మార్కెట్​ లో ఉండే పోటీ వల్ల కొంత  ఆందోళన కలుగుతుంది.  ఉద్యోగస్తులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహారం నిర్ణయం తీసుకోవాలి. జీవితభాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి.ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. 

మిధునరాశి: ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్​  వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్​ లకు చేపట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని పండితులు సూచిస్తున్నారు, వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. చంద్రగ్రహణం కారణంలో సంతానం వలన  ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. 

కర్కాటకరాశి: ఈ రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  సెప్టెంబర్​ 7  రాత్రి ఏర్పడే చంద్రగ్రహణం ప్రభావం ఈ రాశివారిపై అధికంగా ఉంటుంది.  కొంతమంది స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశాలున్నాయి.  ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకోండి. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ వారంలో ఎట్టి పరిస్థితిలో కొత్త పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు.  ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.

సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగాఉంటుంది. గతంలో ఆగిపోయిన  తిరిగి  ప్రారంభమవుతాయి.  సమాజంలో గౌరవం.. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా సాగిపోతుంది. కొన్ని వివాదాలు, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. గ్రహణ ప్రభావంతో  వైవాహిక జీవితంలో సంఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. 

కన్యారాశి: ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి.  పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొనే అవకాశం ఉంది.  నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.  పాత బకాయిలు వసూలవుతాయి.  ఉద్యోగస్తులకు గతంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  అంతా మంచే జరుగుతుంది.  ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
 
తులారాశి: ఈ రాశి వారికి కూడా గ్రహణ ప్రభావం ఉటుంది.  ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి ...  లాభాలలో ఆలస్యం జరుగుతుంది.  ముఖ్యంగా  స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుటకు చాలా దూరంగా ఉండండి. అనవసరమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.  అనవసరమైన ఖర్చులకు కొంచెం దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్త అవసరం.  ఉద్యోగస్తుల విషయంలో పనిభారం పెరుగుతుంది.  ఆఫీసులో అనవసరంగా మాట పడాల్సి వస్తుంది.  గ్రహణం తరువాత దానం ఇవ్వండి.. అంతా మంచే జరుగుతుంది. 

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం వృత్తి.. ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.  నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ వింటారు.  వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.  కొత్తగా పెట్టుబడులు పెడితే అధికంగా లాభాలుంటాయి.  ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.  ఉద్యోగస్తులు ఆఫీసులో కీలక పాత్ర పోషిస్తారు. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేపట్టినా విజయ వంతం అవుతుంది.  డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి.. ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.  ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి . ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.

మకరరాశి: ఈ రాశి వారు   ఈ వారం రిస్క్​ తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.  గ్రహణం ప్రభావంతో వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో ఆలస్యం అయినా.. వారం మధ్యలో  పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలున్నాయి.   వారం చివరిలో కెరీర్​ గురించి మంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.  వృత్తి .. ఉద్యోగాల్లో కీలక  పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది.

కుంభరాశి: ఇదే రాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సెప్టెంబర్​ 7 ఆదివారం ఏర్పడుతుంది. గ్రహణ ప్రభావంతో ఈ రాశి  వారికి   కార్యాలయంలో అకస్మాత్తుగా ప్రమాదం జరుగుతుందనే భయం..  శత్రువుల జోక్యం  అధికంగా ఉంటుంది.  కెరీర్ పరంగా కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి పనిలో   జాగ్రత్తగా వ్యవహరించాలని పండితులు చెబుతున్నారు. . వ్యాపారులకు పాక్షికంగా అనుకూలంగా ఉంటుంది. సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది.  ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి.  ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.మీ ప్రమేయం లేకుండా ..  అనవసరంగా వివాదాల్లో చిక్కుకున్న అవకాశాలున్నాయి. మిమ్మల్ని తక్కువ చేయాలని ప్రయత్నాలు జరుగుతాయి. 

మీన రాశి: ఈ రాశి వారికి గ్రహణం ప్రభావం కొద్దిగా ఉంటుంది.  ఆడంబరాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. . సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించండి.అనవసరమైన వాగ్వాదాలు పెట్టుకోవద్దుజ నోటిని అదుపులో ఉంచుకోండి.  గ్రహణం తరువాత దానాలు ఇవ్వండి .. అంతా మంచే జరుగుతుంది.