ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేత

ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేత

హైదరాబాద్, వెలుగు:ఎంసెట్​లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రాష్ట్ర సర్కారు ఎత్తేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. బుధవారం విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఇంటర్​ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. చాలా ఏండ్లుగా ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తున్నారు.

ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేత

ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఆధారంగా ర్యాంకులు అలాట్ చేస్తున్నారు. అయితే ఏటా ఎంసెట్ రిజల్ట్ ఇచ్చే సమయంలో పలు బోర్డుల రిజల్ట్ రాకపోవడంతో ర్యాంకుల ప్రకటన ఆలస్యమవుతున్నది. దీనికితోడు జేఈఈ, నీట్ తదితర జాతీయ పోటీ పరీక్షలకు ఇంటర్, 12వ తరగతి మార్కులకు వెయిటేజీ ఇవ్వడం లేదు. ఈ వెయిటేజీతో రూరల్ ఏరియాల్లోని సర్కారు కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు తక్కువ మార్కులు వస్తుండటం, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు ఎక్కువ మార్కులు వస్తుండటంతో ఎంసెట్ ర్యాంకుల్లో భారీగా తేడాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వెయిటేజీ ఎత్తేయాలని విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు రావడంతో సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..