అయోధ్యకు సానుకూల పరిష్కారం చూపుతాం: జస్టిస్ కలిఫుల్లా

అయోధ్యకు సానుకూల పరిష్కారం చూపుతాం: జస్టిస్ కలిఫుల్లా

ఢిల్లీ : అయోధ్యలో మందిర్ – మసీద్ వివాదానికి స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కారం చూపిస్తామని చెప్పారు రిటైర్డ్ జస్టిస్ ఇబ్రహీం కలీఫుల్లా. వివాదాస్పద రామ జన్మభూమి అంశాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఉదయం ముగ్గురు సభ్యుల ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటుచేసింది. ప్యానెల్ లో మాజీ న్యాయమూర్తి కలీఫుల్లా , ఆర్ట్ ఆఫ్ లివింగ్  ఫౌండర్ శ్రీశ్రీ రవిశంకర్ , మీడియేషన్ చాంబర్ ఫౌండర్ శ్రీరామ్ పంచూ లను చేర్చింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ను, 8 వారాల్లో తుది పరిష్కారాన్ని సూచించాలని కోర్టు గడువు పెట్టింది.

సుప్రీం ఏర్పాటుచేసిన ప్యానెల్ పై రిటైర్డ్ జస్టిస్ ఇబ్రహీం కలీఫుల్లా స్పందించారు. ఈ కమిటీని తన నాయకత్వంలో ఏర్పాటుచేసినట్టు తెలిసిందని చెప్పారు. ‘ఆర్డర్ కాపీ నాకు ఇంకా అందలేదు. కమిటీ సహాయంతో… సమస్యకు సానుకూల పరిష్కారం సూచించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు కలీఫుల్లా.