సిమ్టమ్స్ ఉన్నా ఆఫీసుకు పోయిండు.. వందల మందికి వైరస్ అంటించిండు

సిమ్టమ్స్ ఉన్నా ఆఫీసుకు పోయిండు.. వందల మందికి వైరస్ అంటించిండు
అమెరికాలోని ఒరెగాన్‌‌‌‌‌‌‌‌లో ఏడుగురు మృతి.. 300 మంది క్వారంటైన్ వాషింగ్టన్: కరోనా సింప్టమ్స్ ఉన్నా ఆఫీసుకు పోయిండు. డ్యూటీకెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు నిర్లక్ష్యంగా తిరిగిండు. దీంతో ఒక్క వ్యక్తి నుంచే.. వందల మందికి వైరస్ అంటుకుంది. వీళ్లలో ఏడుగురు బలైపోయారు. దాదాపు 300 మంది క్వారంటైన్ లోకి పోయారు. అమెరికా ఒరెగాన్ రాష్ట్రంలోని డగ్లస్ కౌంటీలో ఈ సంఘటన జరిగింది. కౌంటీలో ఉండే ఓ వ్యక్తి పోయిన వారం కరోనా లక్షణాలతో బాధపడుతూ ఆఫీస్ కు వెళ్లాడు. తర్వాత ఆయనకు టెస్టు చేస్తే పాజిటివ్ వచ్చింది. ఆయన ద్వారా వైరస్ అంటినవాళ్లలో ఏడుగురు మృతి చెందారని డగ్లస్ కౌంటీ ఆఫీసర్లు ప్రకటించారు. మరోవైపు ఆఫీసోళ్లు, ఆయన ఉంటున్న ఏరియాలోని వాళ్లు దాదాపు 300 మందికి పైగా క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా ఇంత నష్టం జరిగిందని, అది ఊహించుకోవడానికే భయంకరంగా ఉందని పేర్కొన్నారు. క్వారంటైన్ లో ఉన్నోళ్లందరూ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ ఘటన ఏ కంపెనీలో జరిగిందో, ఎవరు వైరస్ ను స్ర్పెడ్ చేశారనే వివరాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు. అయితే అమెరికాలో కరోనా రిస్క్ ఎక్కువున్న రాష్ట్రాల్లో ఒరెగాన్ ఒకటి. ఇక్కడ వచ్చే ఏడాది మార్చి 3 వరకు ‘‘స్టేట్ ఆఫ్​ ఎమర్జెన్సీ’’ విధిస్తూ గవర్నర్ కెటె బ్రౌన్ ఇటీవల ఆర్డర్ ఇచ్చారు.