బెంగాల్‌లో జూలై 15 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

బెంగాల్‌లో జూలై 15 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

డెల్టాప్లస్‌ వేరియంట్‌.. థర్డ్‌వేవ్‌ లతో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూలై 15 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇవాళ(సోమవారం) ప్రకటన విడుదల చేసింది. ఆఫీసుల్లో 50 శాతం హాజరుతో ఉద్యోగులు విధులు నిర్వర్తించవచ్చు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు మాత్రమే ఆఫీసుకు రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
లాక్ డౌన్ నిబంధనలు:
బ్యూటీ పార్లర్లు, సెలూన్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. బజార్లు, మార్కెట్లు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచుకోవచ్చు. ఇతర షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతిచ్చింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మరలా సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు 50 శాతం మందితో జిమ్‌లు నిర్వహించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపవచ్చు.కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయవచ్చు. బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే.. రైళ్ల రాకపోకలపై మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.