ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొట్టిన వెస్ట్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌

ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొట్టిన వెస్ట్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌

కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొట్టిన వెస్ట్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌.. దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో షామ్స్‌‌‌‌‌‌‌‌ ములానీ (4/51), అతిత్‌‌‌‌‌‌‌‌ సేథ్‌‌‌‌‌‌‌‌ (2/29), జైదేవ్‌‌‌‌‌‌‌‌ ఉనాద్కట్‌‌‌‌‌‌‌‌ (2/28) రాణించడంతో.. ఆదివారం ముగిసిన ఫైనల్లో వెస్ట్‌‌‌‌‌‌‌‌ 294 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో సౌత్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. 529 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఛేదించే క్రమంలో 154/6 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన సౌత్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 71.2 ఓవర్లలో 234 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు రవితేజ (53), సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌ (7).. రెండు గంటలు పోరాడినా జట్టును గట్టెక్కించలేకపోయారు. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 57 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేశారు. చివరకు గాజా (1/47) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సాయి ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో కృష్ణప్ప గౌతమ్‌‌‌‌‌‌‌‌ (17) క్రీజులోకి వచ్చాడు. రవితేజకు మంచి సమన్వయం అందిస్తూ.. ఎనిమిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 23 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. కానీ ములానీ.. తేజను ఎల్బీ చే యడంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓటమి ఖరారైంది. బాసిల్‌‌‌‌‌‌‌‌ థంపి (0),  స్టీఫెన్‌‌‌‌‌‌‌‌ (0 నాటౌట్‌‌‌‌‌‌‌‌) నిరాశపర్చారు. యశస్వికి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’, జైదేవ్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌’ అవార్డులు లభించాయి. 

యశస్విపై చర్యలు..

సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ రవితేజపై స్లెడ్జింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడిన తమ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌పై కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రహానె అరుదైన చర్య తీసుకున్నాడు. అతన్ని గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకు పంపించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.  రవితేజకు దగ్గరగా ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన యశస్వి.. పదేపదే మాటలతో రెచ్చగొట్టాడు. ఒకటి, రెండుసార్లు ఓపికగా చూసిన రవి.. 57వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అంపైర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన రహానె.. వెంటనే యశస్విని గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ బయటకు పంపించాడు. దీంతో 10 మందితోనే ఆట కొనసాగించింది. దాదాపు ఏడు ఓవర్ల తర్వాత యశస్వి మళ్లీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. ఎప్పుడూ నిరాంబడరంగా కనిపించే రహానె.. ప్లేయర్లకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఏమాత్రం సహించడు. ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ జాతి వివక్షను ఎదుర్కొన్నప్పుడు కూడా వెంటనే రిఫరీ దృష్టికి తీసుకెళ్లి ఆస్ట్రేలియన్లను కట్టడి చేశాడు.