- నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అకాల వర్షాల వల్ల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ భరోసా ఇచ్చారు. గురువారం ఆయన తెలకపల్లి మండలం చిన్న ముద్దనూరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కొనుగోలు నిర్వహణ, రవాణా, కాంటా వివరాలు, రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే గోదాములకు తరలించాలని ఆదేశించారు. రైతుల నుంచి ఎవరైనా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
