- పోస్టర్ ఆవిష్కరించిన ఫౌండర్ ఝాన్సీ రెడ్డి
జూబ్లీహిల్స్, వెలుగు: మహిళా సాధికారత, ఉపాధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్(వెటా) ఇండియా సంస్థను ఈ నెల 24న హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్లు సంస్థ ఫౌండర్ అండ్ అడ్వైజర్ చైర్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న విమెన్ ఎంపవర్‌మెంట్ సమ్మిట్–2026 పోస్టర్‌ను బుధవారం ఆమె జూబ్లీహిల్స్‌లోని తన ఆఫీస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళలు, యువతులు, విద్యార్థినుల నాయకత్వాన్ని ప్రోత్సహించే వేదికగా వెటా ఇండియా నిలవనుందని తెలిపారు.
సమ్మిట్‌కు మంత్రులు సీతక్క , కొండా సురేఖ, మాజీ సీఎస్కె.రత్నప్రభ, మల్కాజిగిరి సీపీ సుమతి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి.రజని, మాజీ ఐఎఫ్ వోఎస్ ఆఫీసర్నీరజా, ఆర్థికవేత్త డా.పావని ఇటిక్యాల, మహిళా హక్కుల ఉద్యమకారిణి ప్రేమ పావని, వైద్య నిపుణురాలు కావ్య దెందుకూరి పాల్గొంటారని పేర్కొన్నారు.
