రష్యా ఆయిల్‌ కొంటే..మీ ఆర్థిక వ్యవస్థను కూలగొడ్తం

రష్యా ఆయిల్‌ కొంటే..మీ ఆర్థిక వ్యవస్థను కూలగొడ్తం
  • అమెరికా సెనేటర్‌‌గ్రాహం హెచ్చరిక
  • భారత్‌, చైనా, బ్రెజిల్‌పై 100% ట్యాక్స్‌ తప్పదని వార్నింగ్‌

వాషింగ్టన్: రష్యాతో వాణిజ్యం ఆపకపోతే భారత్‌‌, చైనా, బ్రెజిల్‌‌ దేశాల ఆర్థిక వ్యవస్థలను పడగొడ్తామని అమెరికా హెచ్చరించింది. అగ్గువకే వస్తుందని ఆ దేశం నుంచి ఆయిల్‌‌ ఇంపోర్ట్‌‌ చేసుకుంటున్న దేశాల ఎకానమీని అణచివేస్తామని వార్నింగ్‌‌ ఇచ్చింది. యూఎస్‌‌ సెనేటర్‌‌‌‌ లిండ్సే గ్రాహం మంగళవారం ప్రెస్‌‌మీట్​లో మాట్లాడుతూ రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలను హెచ్చరించారు. రష్యా నుంచి ఆయిల్‌‌ కొనుగోలు ఆపకపోతే భారత్‌‌, చైనాతోపాటు రష్యాతో ఒప్పందం చేసుకున్న దేశాలన్నింటిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ 100 శాతం సుంకాలు విధిస్తారని అన్నారు.

రష్యా నుంచి ఆయిల్‌‌‌‌ కొనుగోలు చేయడం అంటే ఆ దేశం ఉక్రెయిన్‌‌‌‌తో చేస్తున్న యుద్ధాన్ని ప్రోత్సహించడమేనని లిండ్సే గ్రాహం అన్నారు. ‘‘భారత్‌‌‌‌, చైనా, బ్రెజిల్‌‌‌‌ చేస్తున్నది రక్తపాతం. ఎవరైనా అడ్డుకునేలా చేసేవరకూ పుతిన్‌‌‌‌ ఆగడు. ఉక్రెయిన్‌‌‌‌పై దాడులు ఆపడు. దాడులకు పాల్పడుతూ ఇతర దేశాలను ఆక్రమించుకోవాలని చూస్తున్నడు. మాజీ సోవియట్‌‌‌‌ యూనియన్‌‌‌‌ను తిరిగి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నడు. ఉక్రెయిన్‌‌‌‌ దేశాన్ని గౌరవిస్తామని మాటిచ్చిన పుతిన్‌‌‌‌.. ఇప్పుడు లిమిట్స్‌‌‌‌ దాటుతున్నాడు” అని గ్రాహం‌‌‌‌ మండిపడ్డారు. కాగా, భారత్‌‌‌‌, చైనాతోపాటు రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న అన్ని దేశాల వస్తువుల దిగుమతిపై 500 శాతం ట్యాక్స్‌‌‌‌లు విధించాలని గ్రాహం ఇటీవలే అమెరికా చట్టసభలో ప్రతిపాదించారు. దీనిపై త్వరలో ఓ బిల్లును కూడా ప్రవేశపెడతామని చెప్పారు. మరోవైపు పుతిన్‌‌‌‌ శాంతి చర్చలకు రావాల్సిందేనంటూ అమెరికా ప్రెసిడెంట్​డొనాల్డ్ ట్రంప్‌‌‌‌  కొద్దిరోజులుగా డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.