బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యలను బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఖండించారు. ఆయనను ఉపరాష్ట్రపతిని చేయనందునే బీజేపీతో బంధాన్ని తెంచుకున్నారన్న వ్యాఖ్యలపై నితీశ్ స్పందించారు. సుశీల్ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని.. అసలు తాను ఉపరాష్ట్రపతి పదవి కావాలని అనుకులేదని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. దీన్నే ఆయన అది ఒక జోక్... అంతా బోగస్ అని అభివర్ణించారు. తమకు అలాంటి ఉద్దేశం లేదు కాబట్టే... రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎన్డీయేకు మద్దతిచ్చాం.. ఆ విషయం మర్చిపోయారా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఉప రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయాలని జేడీయూ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇటీవల తమను కోరారాని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ కామెంట్స్ చేశారు. అలా నితీశ్ ను ఉపరాష్ట్రపతిగా నామినేట్ చేస్తే... ఆయన ఢిల్లీకి వెళ్లిపోతారని... అప్పుడు రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి కావచ్చంటూ జేడీయూ లీడర్లు తమ దగ్గరికి వచ్చారని ఇటీవలే సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాటలు చాలా జోక్ గా అనిపిస్తున్నాయని.. అవన్నీ బోగస్ మాటలు అంటూ నితీశ్ తాజాగా సమాధానమిచ్చారు.

