కేంద్రం ఇంకా ఓకే చెప్పలేదు

కేంద్రం ఇంకా ఓకే చెప్పలేదు

న్యూఢిల్లీ: నగరాల్లో ఫోర్​ వీలర్​ డీజిల్ వెహికల్స్ ను నిషేధించాలంటూ సిఫార్సు చేసిన ఎక్స్​పర్టుల కమిటీ నివేదికను ప్రభుత్వం ఇంకా ఆమోదించ లేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్​జీ) వివరణ ఇచ్చింది. ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ (ఈటీఏసీ) అందజేసిన రిపోర్ట్​ తమకు చేరిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అభిప్రాయం చెప్పలేదని ఒక ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. నగరాల్లో 2027 నాటికి డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నడిచే ఫోర్–వీలర్ వెహికల్స్ ​వినియోగాన్ని నిషేధించాలని ఎక్స్​పర్టుల ప్యానెల్ ​సిఫార్సు చేసింది. ‘‘నగరాల్లో పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలో విషవాయువులను తగ్గించడానికి ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఇంధనంతో నడిచే వెహికల్స్​కు మారాలి. 2030 నాటికి సిటీల్లో డీజిల్​ బస్సులను అనుమతించకూడదు.

2024 నుండి నగరాలలో సరకుల రవాణా​ కోసం డీజిల్ బస్సులను వాడకూడదు. ఎలక్ట్రిక్ వెహికల్స్​ వినియోగాన్ని పెంచేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ స్కీమ్ (ఫేమ్​) కింద ఇచ్చిన ప్రోత్సాహకాలను ఇక ముందు కూడా పొడిగించాలి. బ్యాటరీతో నడిచే సిటీ డెలివరీ వెహికల్స్​కు మాత్రమే 2024 నుంచి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అనుమతించాలి. వస్తువుల రవాణా కోసం రైల్వేలను, గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నడిచే ట్రక్కులను ఎక్కువగా ఉపయోగించాలి. సుదూర బస్సులను భవిష్యత్​లో బ్యాటరీలతో నడిచేలా చేయాల్సి ఉంటుంది. రాబోయే 10–15 సంవత్సరాల్లో గ్యాస్​ వాడకాన్ని విపరీతంగా పెంచాలి” అని కమిటీ సూచించింది. చమురు శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నాయకత్వంలోని ఎనర్జీ ట్రాన్సిషన్​అడ్వైజరీ కమిటీ ఈ సిఫార్సులను చేసింది.