నారాయణఖేడ్ ఉప ఎన్నికల హామీలేమయ్యాయి..?

నారాయణఖేడ్ ఉప ఎన్నికల హామీలేమయ్యాయి..?

దౌల్తాబాద్ ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

దుబ్బాక: నారాయణఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలేమయ్యాయి..?.. ఇంత వరకు అతీగతీ లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్  మండల కేంద్రంలో బీజేపీ నిర్వహించిన భారీ బైకు ర్యాలీలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. స్వయంగా బైకు నడిపి కార్యకర్తలను హుషారెత్తించారు. ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్  దౌల్తాబాద్ లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రభుత్వంలో హరీష్ రావు మాట ఎవరు వింటలేరు.. ఖాళీగా ఎన్నికల కు మాత్రమే వాడుకొంటున్నారు.. నారాయణ ఖేడ్ ఉప ఎన్నికలలో హరీష్ ఇచ్చిన హామీలను ఇంతవరకు నేరవేర్చలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన ఫసల్ భీమ దేశంలోనే చాలా మంచి పథకం..  కానీ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుత లేడు.. కేవలం కమిషన్ దొబ్బడానికి కాళేశ్వరం పాజెక్ట్ కడుతున్నారని ఆరోపించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ను, వేల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని మాట ఇచ్చి.. తప్పినాడు.. హైదరాబాద్ లో వర్షాలతో ముంపునకు గురైన బాధితులకు పది వేల రూపాయలు ఇస్తుంటే.. దాంట్లో కూడా కమిషన్ తీసుకుంటున్నారని విమర్శించారు. కేసిఆర్ ను చెంప దెబ్బ కోట్టే సమయం ఈ ఓటు ద్వారా నే ఉంది.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.