హుస్సేన్ సాగర్ పరిరక్షణకు చర్యలేవి.?

హుస్సేన్ సాగర్ పరిరక్షణకు చర్యలేవి.?

న్యూఢిల్లీ,వెలుగు: హుస్సేన్ సాగ‌ర్ పరిరక్షణలో రాష్ట్రప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని నిపుణుల కమిటీ రిపోర్ట్ ద్వారా తెలుస్తోందని నేషన‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్టీ) జీ శుక్రవారం అభిప్రాయప‌డింది. కాలుష్యం, ఆక్రమణల నుంచి కాపాడడంలో అధికార యంత్రాంగం పేలవ పనితీరును కనబర్చిందని ఎన్జీటీ చెన్నై బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. నీటి వన‌రుల యాజమాన్యంపై పలు శాఖల మధ్య అసలు సమన్వయమే లేదని రిపోర్ట్ ద్వారా అరమవుతోందని అభిప్రాయ‌డింది. శుద్ధి చేయని వ్యర్థ జలాలను హుస్సేన్ సాగర్ లోకి వెళ్లకుండా  నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కామెంట్ చేసింది. లేక్ క్యాచ్ మెంట్ ఏరియాలో ఆక్రమణలు తొలగించడంలో సర్కార్ ఏ మాత్రం జోక్యం చేసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని ఆదేశించింది. హుస్సేన్ సాగర్, మూసీ నది కాలుష్యమవడంపై సామాజిక కార్యకర్తలు లుబ్నా సార్వత్ వేసిన పిటిషన్ ను ఎన్జీటీ విచారిస్తుంది.