ట్రంప్ చెప్పిన థర్డ్ వరల్డ్ దేశాలు అంటే ఏంటి..? వాటిలో ఇండియా కూడా ఉందా..?

ట్రంప్ చెప్పిన థర్డ్ వరల్డ్ దేశాలు అంటే ఏంటి..? వాటిలో ఇండియా కూడా ఉందా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మరింత కఠినం చేస్తున్నారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో యూఎస్ నేషనల్ గార్డ్ సైనికులపై ఆఫ్గన్ పౌరుడు దాడి చేసి ఇద్దరు తీవ్రంగా గాయపడిన తర్వాత సంచన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో Third World countries నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన అమెరికా చరిత్రలో అత్యంత కఠినమైన వలస నియంత్రణల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. 

అసలు థర్డ్ వరల్డ్ దేశాలు అంటే ఏమిటి?

కోల్డ్ వార్ థర్డ్ వరల్డ్ దేశాలు అనే పదం పుట్టింది. 1952లో ఫ్రెంచ్ జనాభా నిపుణుడు అల్ఫ్రెడ్ సౌవీ రాసిన ఆర్టికల్‌లో మొదటిసారి Third World అనే పదాన్ని ఉపయోగించారు. అప్పట్లో మొదటి ప్రపంచం అంటే అమెరికా, నేటో మిత్రదేశాలు. అలాగే రెండవది సోవియట్ యూనియన్, కమ్యూనిస్ట్ దేశాలు. మిగిలినవి ఏ కేటగిరీ కిందికి రాని ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలను థర్డ్ వరల్డ్ దేశాలుగా పిలిచేవారు.​ఈ థర్డ్ వరల్డ్ దేశాల్లో ఎక్కువగా పేదలు, బ్రిటన్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందినవి ఉండేవి. నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ ద్వారా వీటి ఆసక్తులను ప్రతినిధిస్తూ పోరాడారు. అయితే సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఈ పదం అప్రస్తుతమైంది.​

ALSO READ : మార్కెట్లు భారీగా పెరిగినా మీకు మాత్రం లాభాలు రావట్లేదా..

ఇప్పుడు ఈ పదం దేనిని సూచిస్తుంది?

ప్రస్తుతం థర్డ్ వరల్డ్ దేశాలు అంటే ఆర్థికంగా వెనుకబడినవిగా పరిగణించబడుతోంది. ఐక్యరాష్ట్ర సమితి 'లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్' జాబితాలో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో ఆఫ్రికా నుంచి 32, ఆసియా నుంచి 8 (ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్), హైటీ, పసిఫిక్ ద్వీపాలు ఉన్నాయి. అయితే ట్రంప్ ఏ దేశాలను ఉద్దేశించి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే పదాన్ని వాడాలో స్పష్టత ఇవ్వలేదు. ట్రంప్ ప్రకటన ఆఫ్ఘన్ దాడి తర్వాత వచ్చింది. బైడెన్ కాలంలో పొంది గ్రీన్ కార్డులను పరిశీలిస్తానని, "నెట్ అసెట్ కానివారిని" తిరిగి వెనక్కి పంపించనున్నట్లు హెచ్చరించారు. 

ట్రంప్ లిస్టులో భారత్ ఉందా..?

కోల్డ్ వార్‌లో భారతదేశం నాన్-అలైన్డ్‌గా థర్డ్ వరల్డ్ దేశాల జాబితాలో నిలిచింది. కానీ ఇప్పుడు పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కొన్నాళ్ల కిందట జీడీపీలో జపాన్‌ను అధిగమించి నాల్గో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీగా వర్గీకరించబడింది. "లో-ఇన్‌కమ్" కేటగిరీలో మాత్రం లేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం ట్రంప్ ప్రకటన భారతదేశాన్ని ప్రభావితం చేస్తుందా అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఒక వేళ ఇండియా ట్రంప్ హిట్ లిస్టులో ఉంటే కోటి కలలతో అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయుల ఆశలతో పాటు ఇప్పటికే అక్కడ స్థిరపడిన, పనిచేస్తున్న ఇండియన్స్ పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. 

థర్డ్ వరల్డ్ దేశాల జాబితా:

అంగోలా, ఇథోపియా, మాల్వి, రవాండా, యుగాండా, జాంబియా, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, యెమెన్, హైతీ, కిరిబాటి, సోలోమాన్ ఐలాండ్స్, తువాలు వంటివి ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాలను పరిశీలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో-బ్రాజావిల్లే, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులాలు ఉన్న సంగతి తెలిసిందే.