ప్రమాదానికి ముందు చివరి గంటలో ఏమైంది?

ప్రమాదానికి ముందు చివరి గంటలో ఏమైంది?
  • యాక్సిడెంట్ టైంలో ఎస్ఎల్డీసీ కంట్రోల్ రూతో టచ్లో ప్లాంట్ స్టాప్
  • మంటలు అంటుకోవడంపై ఏం మాట్లాడారు? కంట్రోల్ రూం చేసిన సూచనలు, జాగ్రత్తలేంటి?
  •  విద్యుత్ సౌధలో ఉన్న ఆడియో టేపులు.. కీలక వివరాలన్నీ వాటిల్లోనే!
  • వాటి స్వాధీనంపై సీఐడీ దృష్టి

 

ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్న శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో ఆడియో టేపులు కీలకంగా మారనున్నాయి. ప్రమాదం జరగడానికి గంట సేపటి ముందు నుంచీ ప్లాంటులో ఏం జరిగింది, ఎందుకు మిరుగులు చిమ్మాయి, ప్యానెల్ బోర్డులో మంటలెందుకు వచ్చాయి, ప్లాంట్లోని స్టాఫ్ ఏ సమాచారం ఇచ్చారు, యాక్సిడెంట్పై ఏమని రిపోర్ట్ చేశారు, అధికారులు ఏమేం జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారన్నవన్నీ మినట్టు మినట్ ఎస్ఎల్డీసీ(స్టేట్లోడ్డిస్పాచ్సెంటర్) కంట్రోల్ రూమ్లో రికార్డయ్యాయి. ప్లాంట్స్ ప్రమాదం జరగడానికి ముందు నుంచీ కంట్రోల్ రూంతో టచ్లో ఉన్నారు. ఆ టైంలో వాళ్లు మాట్లాడినవన్నీ రికార్డయ్యాయి. ప్రమాదానికి సంబంధించి వీటిలో కీలక వివరాలు బయటపడే అవకాశం ఉంది. సర్కారు ఇప్పటికే శ్రీశైలం ప్లాంట్ ప్రమాదంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ప్రాథమికంగా ప్లాంట్కు వెళ్లి పరిశీలించిన సీఐడీ అధికారులు.. ప్రమాదానికి దారితీసిన తక్షణ కారణాలపై దర్యా ప్తు చేస్తున్నారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వాళ్లుచివరిగా చెప్పిన మాటలను విశ్లేషిస్తున్నారు. ఇదే టైంలో ఎస్ఎల్డీసీ ఆడియో టేపులపై దృష్టి పెట్టారు.

 కంట్రోలింగ్ ఇక్కడి నుంచే..

రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థలన్నింటినీ నియంత్రించే సెంటర్ ఎస్ఎల్డీసీ. పవర్ జనరేషన్ తో పాటు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అన్నింటినీ ఇదే మానిటర్ చేస్తుంది. ఎక్కడ ఎంత కరెంట్ ఉత్పత్తి చేయాలి, పెంచాలా .. తగ్గించాలా , ఎంత డిమాండ్ ఉంది, డిమాండ్కు సరిపడా సప్లైఉందా, ఎక్కడి నుంచైనా కొనాలా.. వంటివన్నీ ఎస్ఎల్డీసీ పర్య వేక్షిస్తుంది. దీని కంట్రోల్ రూం హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ బిల్డింగ్లో ఉంది. అక్కడి నుంచే రా ష్ట్రంలోని అన్ని పవర్ ప్లాంట్లు, సబ్స్టేషన్లకు ఆప్టికల్ పైబర్ హాట్ లైన్తో అనుసంధానం ఉంటుంది. కంట్రోల్ రూం నుంచి పవర్ ప్లాంట్లు, ట్రాన్స్ మిషన్స్ సెంటర్ల స్టాప్ తో  మాట్లాడే ప్రతి సంభాషణ రికార్డ్ అవుతుంది.

బయటికి చెప్పడం లేదేం?

శ్రీశైలం పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగిన టైంలో కూడా ప్లాంట్లో ఉన్న స్టాఫ్ ఎస్ఎల్డీసీ కంట్రోల్ రూంతో టచ్లో ఉన్నారు. ప్లాంట్లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు హాట్లైన్లో సమాచారమిచ్చారు. హైదరాబాద్ ఆఫీసులో ఉన్న జెన్కో ఇంజనీర్లు, అధికారులు కూడా ప్లాంట్లో ఉన్న స్టాఫ్ తో టచ్లో ఉన్నారు. ఈ క్రమంలో మంటలు అంటుకున్నప్పటి నుంచి, హాట్ లైన్ కట్అయ్యేంత వరకు చివరి గంటసేపు ఎలాంటి సంభాషణలు జరిగాయి, ప్లాంట్ సేఫ్టీతోపాటు ప్రమాదం నుంచి ఉద్యోగులను కాపాడేందుకు ఎలాంటి జాగ్రత్తలు, ఆదేశాలు ఇక్కడి నుంచి అందించారు, ప్లాంట్ స్టాఫ్ ఏమేం కారణాలు చెప్పారనే వివరాలన్నీ ఆడియో రికార్డుల్లో ఉంటాయి. ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా అవి బయటికి రాలేదు. కేసును విచారిస్తున్న సీఐడీ ఒకట్రెండు రోజుల్లో ఆ ఆడియో టేపులను స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి.