IPL 2026 Final: IPL 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. రేపు (2026, మే 31న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే మహా సంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆర్సీబీ క్వాలిఫైయర్ 1లో గెలిచి నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లగా, గుజరాత్ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ టైటిల్ పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే రూల్స్ ఏంటి? అసలు మ్యాచ్ జరగకపోతే ట్రోఫీ ఎవరికి దక్కుతుంది? అనే విషయాలపై ఇరు జట్ల అభిమానుల్లో తెగ ఉత్కంఠ నెలకొంది.
వర్షం కురిస్తే పరిస్థితి ఏంటీ?:
* మే 31న ఫైనల్ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడితే, మ్యాచ్‌ను అదే రోజు పూర్తి చేయడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తారు.
* ఓవర్ల కుదింపు: వర్షం కారణంగా సమయం వృథా అయితే ఓవర్లను కుదిస్తారు.
* అదనపు సమయం: విజేతను తేల్చడం కోసం షెడ్యూల్ సమయం కంటే 120 నిమిషాల (2 గంటలు) అదనపు సమయాన్ని కేటాయిస్తారు.
* కనీస ఆట: ఫలితం తేలాలంటే రెండు ఇన్నింగ్స్‌లలో కనీసం 5 ఓవర్ల చొప్పున ఆట జరగడం తప్పనిసరి.
* రద్దు: ఒకవేళ ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే ఆ రోజు మ్యాచ్‌ను రద్దు చేస్తారు.
రిజర్వ్ డే రూల్స్:
* మే 31న వర్షంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, ఈ పోరును రిజర్వ్ డే (Reserve Day)కి మారుస్తారు. అంటే జూన్ 1వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ని జరుపుతారు.
* ఒకవేళ మే 31న మ్యాచ్ ప్రారంభమై, మధ్యలో వర్షం పడి ఆగిపోతే.. రిజర్వ్ డే (జూన్ 1) నాడు మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో, అక్కడి నుంచే మిగిలిన ఆటను కొనసాగిస్తారు.
►ALSO READ | ఒక్క ఫైనల్ ఓడిపోని హేజిల్‌వుడ్.. ఆర్సీబీకి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా!
మ్యాచ్ రద్దయితే ఛాంపియన్ ఎవరు?:
* దురదృష్టవశాత్తూ రిజర్వ్ డే (జూన్ 1) నాడు కూడా భారీ వర్షం కురిసి మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం లీగ్ స్టేజ్‌లో పాయింట్ల పట్టిక (Points Table) లో మొదటి స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.
* ఆర్సీబికే ట్రోఫీ: ఈ రూల్ ప్రకారం, గుజరాత్ టైటాన్స్ కంటే పాయింట్స్ టేబుల్‌లో మెరుగైన స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజేతగా అవతరిస్తుంది.
The journey meets its destination 🛣️📍
— IndianPremierLeague (@IPL) May 30, 2026
Who will emerge as 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦? 🏆#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/JnqTIa7bNj
