ఎలా వచ్చిందోగానీ కరోనా వైరస్ మన జీవితాల్లోకి వచ్చేసింది. దీన్ని ఎప్పటికీ ఉండిపోయే జబ్బు.. అంటే ‘ఎండెమిక్’గా డబ్ల్యూహెచ్‌ఓ చెప్తోంది. అంటే కాలక్రమంలో దీన్ని ఎదుర్కొనే శక్తి మన బాడీకి రావాలి. ఈ లోపు చాలామందికి వ్యాధి సోకి వాళ్లు దీన్నుంచి బయటపడే ఇమ్యూనిటీ తెచ్చుకొని ఉండాలి. ఇలాంటి పరిస్థితిని ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అంటారు. కాకపోతే ఈలోపు ఎంతమంది చనిపోతారో చెప్పలేం. లేదా వ్యాక్సిన్ రావాలి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మెల్లగా వైరస్ మనిషి నుంచి మనిషికి పాకే చెయిన్ తగ్గిపోతుంది. అలా హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయి వైరస్ స్ప్రెడ్ ఆగిపోతుంది. ఈ రెండూ జరగడానికి ఏడాది, రెండేళ్లు పట్టొచ్చు. ఈ లోపున అతి సహజంగా వైరస్ దానంతట అది వీక్ అయిపోవచ్చు. ఈ లోపున మనందరం జాగ్రత్తగా బతకాల్సిందే. అలాగే ప్రభుత్వాలు వీలైనంతమందికి టెస్టులు చెయ్యాల్సిందే!
