
- పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: బనకచర్లపై తాము కొట్లాడుతుంటే కేటీఆర్ మాత్రం నారా లోకేశ్ తో రహస్య మంతనాలు జరుపుతున్నారని, దీనిపై కేటీఆర్ స్పందించాలని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. లోకేశ్ ను ఇప్పటి వరకు కేటీఆర్ రెండుసార్లు కలిశారన్నారు.
లోకేశ్‌తో ఆ సీక్రెట్ మీటింగ్ ఏంటో, అది ఎవరికి లబ్ధి చేయడానికో బయటపెట్టాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్, ఆయన స్థాయికి సీఎం అక్కర్లేదని, తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అన్ని విషయాలపై చర్చించేందుకు సోమవారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు రావాలని కేటీఆర్‌ను కోరారు.