"Project K" అంటే ఏమిటి?.. ప్రపంచం ఏం తెలుసుకోవాలనుకుంటోంది!

"Project K" అంటే ఏమిటి?.. ప్రపంచం ఏం తెలుసుకోవాలనుకుంటోంది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ప్రాజెక్ట్ 'కే'(Project K). జూలై 19న అమెరికాలో ఈ కామిక్- కాన్ వేడుకలు ప్రారంభం కానున్న విషయం తెలిసేందే. తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్(Vyjayanthimovies) నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

"Project K అంటే ఏమిటి..దీని వెనుక దాగి ఉన్న మీనింగ్ ఏంటో ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోంది. ఇవాళ (జూలై 8న)రాత్రి 7:10 గంటలకు వేచి ఉండండి" అంటూ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ మూవీ అత్యాధునిక టెక్నాలజీతో వస్తుండటంతో.. ప్రాజెక్ట్ కే అంటే అర్ధం ఎవ్వరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ రోజు సాయంత్రం రాబోతున్న అప్డేట్ తో మూవీ థీమ్ తెలుసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ప్రాజెక్ట్ కే సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అమితబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ప్రాజెక్ట్K 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.