గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ పోరులో..స్వతంత్రుల ప్రభావమెంత ?

గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ పోరులో..స్వతంత్రుల ప్రభావమెంత ?
  •     బరిలో 52 మంది క్యాండిడేట్లు, ఇందులో 38 మంది ఇండిపెండెంట్లే..
  •     గతంలో ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా టఫ్‌‌‌‌‌‌‌‌ఫైట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న
  •     మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరు తుది దశకు చేరుకుంది. శనివారంతో ప్రచార గడువు ముగియగా సోమవారం ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ జరగనుంది. అసెంబ్లీ, లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న మరో కీలక ఎన్నిక కావడంతో కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో మూడు పార్టీల క్యాండిడేట్లు, ముఖ్య నేతలు ఇన్ని రోజులు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించారు. ఓ వైపు ప్రధాన పార్టీల క్యాండిడేట్లు హోరాహోరీ తలపడుతుండగా, మరో వైపు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇండిపెండెంట్లు రెడీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 38 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. 

మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు

గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ పోరులో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న పోటీ చేస్తుండగా, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి ఏనుగుల రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు సవాల్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 4.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు మూడు పార్టీల నేతలు ఇన్ని రోజులు ఉరుకులు, పరుగులు పెట్టారు.

కాగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32 స్థానాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకే బలం ఉండడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ చతికిలపడినప్పటికీ సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ స్థానాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. అభ్యర్థి ఎంపికపై మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినా.. లీడర్లందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నాలు చేశారు. సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ స్థానం కావడం, రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డికి యూత్‌‌‌‌‌‌‌‌లో మంచి పేరు ఉండడం

పార్టీ లీడర్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయడంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కూడా గెలుపు ధీమాతోనే ఉంది. ఇక ప్రధాని మోదీ మేనియాతో బీజేపీకి కొంత ఓటు బ్యాంక్‌‌‌‌‌‌‌‌ మెరుగవగా, గత ఎన్నికల్లో ఓటమి చెందిన గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఈ సారి సింపతీ కూడా కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ స్థానంపై ఇండిపెండెంట్ల ఆశలు

గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్నకు దక్కిన ఆదరణ పోటీలో నిలిచిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు కూడా దక్కకపోవడం గమనార్హం. దీంతోనే ఈ సారి కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌ స్థానంపై ఇండిపెండెంట్లు ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ క్యాండిడేట్లతో పాటు 11 మంది రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌ పార్టీల క్యాండిడేట్స్, మరో 38 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ మొదటి నుంచీ పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

మరో వైపు కోచింగ్‌‌‌‌‌‌‌‌ సెంటర్ల నిర్వాహకుడిగా ఉద్యోగులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లకు పరిచయం ఉన్న పాలకూరి అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ కూడా గెలుపు కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పాటు మరికొందరు ఇండిపెండెంట్లు క్రాంతికుమార్, కేయూ విద్యార్థి నేతలు గుగులోతు రాజు, అనిల్ తదితరులు కూడా పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, ప్రస్తుత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పాలనను ప్రచార అస్త్రాలుగా చేసుకుని పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

కాగా ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న మినహా ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. ఈ సారి పార్టీల అభ్యర్థులతో పాటు ఏకంగా 38 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలవడంతో పట్టభద్రులు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న ఆసక్తి నెలకొంది.

గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన మల్లన్న

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా పోటీ చేసిన తీన్మార్​ మల్లన్న ప్రధాన పార్టీల క్యాండిడేట్లకు చుక్కలు చూపెట్టారు. ముఖ్యంగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డిపై గెలిచినంత పని చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 71 మంది పోటీ చేయగా, ప్రధాన పార్టీల నుంచి నలుగురు, రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌ పార్టీల నుంచి 12 మంది బరిలో నిలిచారు.

మిగిలిన 55 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఇందులో ప్రధాన పార్టీలు, రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌ పార్టీల క్యాండిడేట్లను కాదని ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా పోటీ చేసిన తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి టఫ్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఉత్కంఠగా సాగిన పోరులో చివరకు స్వల్ప తేడాతో పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక్యయారు.