లేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ ... ఏం చేస్తున్నది? : హైకోర్టు

లేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ ... ఏం చేస్తున్నది? : హైకోర్టు
  • లేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ ... ఏం చేస్తున్నది?
  • పనిచేయకపోతే రద్దు చేస్తం: హైకోర్టు
  • హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులపై ఆగస్టు 11లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
  • బఫర్​ జోన్​లో నిర్మాణాలకు వీలు లేదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: చెరువుల పరిరక్షణను తేలికగా తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు బఫర్‌‌‌‌ జోన్లల్లో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. 2008లో ఏర్పాటైన లేక్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ కమిటీ ఏం చేస్తున్నదని ప్రశ్నించింది. ఆ కమిటీ పనితీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. 15 ఏండ్లుగా రాష్ట్రంలోని చెరువుల బఫర్‌‌‌‌ జోన్లను కమిటీ గుర్తించకపోవడం ఏమిటని నిలదీసింది. చట్టప్రకారం కమిటీ పనిచేయకపోతే ఉపయోగం ఏమిటని ప్రశ్నించింది. పనిచేయనిపక్షంలో కమిటీని రద్దు చేయాలని సిఫార్సు చేయాల్సివస్తుందని హెచ్చరిక చేసింది. బాధ్యతల నుంచి తప్పించుకోడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆగస్ట్‌‌‌‌ 11లోగా కనీసం హెచ్‌‌‌‌ఎండీఏ లిమిట్స్‌‌‌‌లోని చెరువుల బఫర్‌‌‌‌ జోన్లను నిర్ధారించి కమిటీ రిపోర్టు ఇవ్వాలని, తమ ఆదేశాల్ని తేలిగ్గా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. 

రామమ్మకుంట బఫర్‌‌‌‌ జోన్‌‌‌‌ పరిధిలో నేషనల్‌‌‌‌ ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ టూరిజం అండ్‌‌‌‌ హాస్పిటాలిటీ మేనేజ్​మెంట్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ కట్టడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ హ్యూమన్‌‌‌‌ రైట్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కన్జూమర్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ సెల్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ పిల్‌‌‌‌ను గురువారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆలోక్‌‌‌‌ ఆరాదే, జస్టిస్‌‌‌‌ టి.వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌లతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ వాదిస్తూ, ఈ ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్‌‌‌‌ఎంసీ పర్మిషన్‌‌‌‌ ఇచ్చాకే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, చట్ట ప్రకారమే ఇని​స్టిట్యూట్‌‌‌‌ నిర్మాణం మొదలైందని చెప్పారు. 26 ఎకరాల విస్తీర్ణంలో మూడు ఎకరాల్లోనే నిర్మాణం జరుగుతోందన్నారు. 80 శాతం నిర్మాణాలు పూర్తి అయ్యాక జూన్‌‌‌‌ 5న స్టేటస్‌‌‌‌కో ఆర్డర్‌‌‌‌ను హైకోర్టు జారీ చేసిందని, దీనిని ఎత్తేయాలని కోరారు. 

ALSO READ:దవాఖాన్లకు గర్భిణుల తరలింపు.. సిబ్బంది సెలవులు రద్దు

అవసరమైతే చట్టాన్ని కూడా రద్దు చేస్తం..

నిర్మాణాలు ఆగితే ప్రభుత్వానికి ఆర్థికంగా భారమే కావచ్చునని, అలాగని చెప్పి బఫర్‌‌‌‌ జోన్‌‌‌‌లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేమని డివిజన్‌‌‌‌ బెంచ్ స్పష్టం చేసింది. లేక్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ కమిటీ రామమ్మకుంట బఫర్ జోన్‌‌‌‌ను గుర్తించిందా? లేదా? అని ప్రశ్నించింది. 2008లో కమిటీ ఏర్పాటైనప్పటికీ బఫర్​ జోన్లను ఎందుకు నోటిఫై చేయలేదని ప్రశ్నించింది. హైదరాబాద్‌‌‌‌ పరిసరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల హద్దులను గుర్తించాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కమిటీ పనిచేయకపోతే దానిని రద్దు చేయవచ్చు కదా అని వ్యాఖ్యానించింది. 

అవసరమైతే ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పింది. బఫర్‌‌‌‌ జోన్ల పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలు జరగకూడదని తేల్చి చెప్పింది. రామమ్మకుంటలో జరుగుతున్న పనుల మ్యాప్‌‌‌‌ను పరిశీలిస్తే ఎక్కువ నిర్మాణం బఫర్‌‌‌‌ జోన్‌‌‌‌లోనే జరిగినట్లుగా ఉందని స్పష్టం చేసింది. బఫర్‌‌‌‌ జోన్‌‌‌‌ బయట పనులను కొనసాగించుకోవడానికి అనుమతిస్తూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్ని మార్పు చేసింది. బఫర్ జోన్‌‌‌‌ పరిధిలో ఏవిధమైన నిర్మాణాలు చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది.