మేము ప్రాజెక్టుల దగ్గరకు వెళితే కేసీఆర్ కు ఏం ఇబ్బంది

మేము ప్రాజెక్టుల దగ్గరకు వెళితే కేసీఆర్ కు ఏం ఇబ్బంది

కేసీఆర్ దుర్మార్గపు పరిపాలనలో  ప్రతి పక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కూడా తిరిగే అవకాశం లేదని ఆరోపించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్, మంజీరా ప్రాజెక్ట్ దగ్గర పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భానూర్ పోలీస్ స్టేషన్ నుండి సొంత పూచీకత్తు పై విడుదలయ్యారు. అనంతరం మాట్లాడిన ఉత్తమ్..మేము ప్రాజెక్ట్ లు తిరిగితే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఏ సెక్షన్, ఏ చట్టం ప్రకారం ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లకుండా ఆపుతున్నారంటూ డీజీపీని అడిగారు. అంతేకాదు మీరు ఐపీఎస్ అధికారులు, కల్వకుంట ప్రైవేట్ సైన్యం కాదన్నారు. కేసీఆర్ కొండ పోచమ్మ దగ్గర వందలమంది తో సమావేశం నిర్వహిస్తే తప్పు లేదు కానీ… మేము తిరిగితే తప్పేలా అవుతుందన్నారు. చట్టాలను అక్రమంగా వాడుకొని ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్. తెలంగాణ ఐపీఎస్ అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి… ఎవరి మాటలో విని ప్రతిపక్షాలను అణిచివేసే కార్యక్రమం చేయవద్దని సూచించారు.